ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేశ్?

55చూసినవారు
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేశ్?
సావిత్రి బయోపిక్ 'మహానటి'లో మెప్పించిన కీర్తి సురేశ్.. ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జీవితంలో విషాద ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్