భారీ వర్షాలతో కేరళ జలమయం

65చూసినవారు
భారీ వర్షాలతో కేరళ జలమయం
రుతుపవనాల ప్రభావంతో కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టాయం జిల్లాలో స్థానికులైన 582 మందిని అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్