భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులుపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైంది. కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వివాదం వెలుగులోకి వచ్చింది. అతడి కోడలు తన స్వగ్రామమైన ఏపీలోని తాడేపల్లిగూడెం పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. వావివరసలు మరచి అతని పోలికలతో కొడుకు కావాలని తనను వేధించేవాడని, తీవ్ర అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు పత్రంలో ప్రస్తావించారు.