ద్విచక్రవాహనంలో నగదు చోరీ

68చూసినవారు
ద్విచక్రవాహనంలో నగదు చోరీ
దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ దాబా హోటల్ వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనంలో ఉన్న నగదును గుర్తు తెలియని ఓ దుండగుడు చోరీ చేశాడు. కొందరు పోస్టల్ సిబ్బంది ద్విచక్ర వాహనాలపై వచ్చి హోటల్లో భోజనం చేసే క్రమంలో ద్విచక్రవాహనాలను హోటల్ ఎదురుగా పార్కింగ్ చేశారు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు ద్విచక్రవాహనంలో ఉన్న రూ. 3వేల నగదు, ఇతర సామగ్రిని దొంగిలించి పారిపోయాడు. ఈఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్