చర్ల: మావోయిస్టు మృతదేహాల్ని తరలిస్తున్న పోలీసులు
ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా బెజ్జి పరిధిలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతం తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలం నుంచి పది మృతదేహాలతో పాటు భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో శనివారం సుక్మా జిల్లా హెడ్ క్వార్టర్ కి మృతదేహాలని తరలించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.