చెరువుల్లో పూడికతీత పనులపై దృష్టి సారించాలి

57చూసినవారు
చెరువుల్లో పూడికతీత పనులపై దృష్టి సారించాలి
ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం తగ్గినందున పూడికతీతపై దృష్టి సారించాలని గురువారం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. తద్వారా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాక పూడిక మట్టి రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రైతులు మట్టి కోసం ఏఈఓకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని, మట్టి తరలింపులో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్