బెస్ట్ అవైలబుల్ కు రేపు లాటరీ ద్వారా ఎంపిక

59చూసినవారు
బెస్ట్ అవైలబుల్ కు రేపు లాటరీ ద్వారా ఎంపిక
బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 11న ఖమ్మం డీపీఆర్సీ భవనంలో లాటరీ తీయనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపికకు ఉదయం 11 గంటలకు, ఐదో తరగతిలో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీస్తామని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వారికి సూచించిన సమయాల్లో హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్