పోలీస్ స్టేషన్ ఎదుట మృతుల కుటుంబీకుల ఆందోళన

1037చూసినవారు
రఘునాథపాలెం మండలం హర్యతండా సమీపంలో ఇటీవల రోడ్డుప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న అనుమానితుడిగా ఉన్న భర్తను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ మృతుల కుటుంబీకులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you