ఫైనాన్స్ వేధింపుల కేసులో ఐదుగురి అరెస్ట్

1059చూసినవారు
ఫైనాన్స్ వేధింపుల కేసులో ఐదుగురి అరెస్ట్
ద్విచక్ర వాహనంపై తీసుకున్న రుణం చెల్లించాలని వెంట పడి తరుముతుండగా, యువకుడు చెరువులో పడి మృతి చెందిన ఘటనకు బాధ్యులైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన వినయ్ మృతి ఘటనలో ఇప్పటికే రికవరీ ఏజెంట్లు రాంచందర్, అజయ్ కుమార్, ఇంటి యజమాని ఎస్. రవి, మేస్త్రీ శ్రీనును అరెస్ట్ చేయగా, ఫైనాన్స్ సంస్థ యజమాని సైదారావును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్