సిగ్నల్ పాయింట్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలి

70చూసినవారు
సిగ్నల్ పాయింట్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలి
ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రధాన సిగ్నల్ పాయింట్స్ లలో నీడ కోసం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, బల్లేపల్లి సెంటర్ లో స్పీడ్ బ్రేకర్స్, సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలని పివైఎల్ జిల్లా కార్యదర్శి ఎన్వి రాకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. పలుచోట్ల చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.