నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి

81చూసినవారు
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి
నీట్-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో నీట్-2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నీట్ పరీక్షా ఫలితాల వెల్లడిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి సమాచారం లేకుండా సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున హడావిడిగా ఫలితాలు విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్