ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

55చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడే ప్రమాద మున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్