రంజాన్ సందడి.. కొనుగోళ్లతో మార్కెట్ రద్దీ

78చూసినవారు
రంజాన్ సందడి.. కొనుగోళ్లతో మార్కెట్ రద్దీ
ముస్లింలు గురువారం రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. దీంతో పండుగ సామగ్రి కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో ముస్లింలు రావడంతో ఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్పాబజార్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. సీమియాతో పాటు దుస్తులు, చెప్పులు, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయడం కనిపించింది. అయితే, పలువురు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడంతో ముస్లింలే కాక ఇతరులు కూడా కొనుగోళ్లకు రావడం విశేషం.

సంబంధిత పోస్ట్