కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు అభినందనలు తెలిపిన తాండ్ర

70చూసినవారు
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు అభినందనలు తెలిపిన తాండ్ర
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను డిల్లీలో సోమవారం ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. భాజపాలో సామాన్య కార్యకర్తగా బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఆరూరి రమేష్, సైదిరెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్