పూడికతీత పనులను పరిశీలించిన మేయర్

56చూసినవారు
పూడికతీత పనులను పరిశీలించిన మేయర్
ఖమ్మం 6, 10వ డివిజన్ (ఖానాపురం నుండి చైతన్య నగర్ వరకు) డ్రెయినేజీ కాలువ పూడికతీత పనులను మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు.
రానున్న వర్షాకాలంలో వాగుల ప్రక్కన నివాసం ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, జమ్మి, షీల్డ్ ను తొలగించి ప్రమాదాలు జరగకుండా పూడికతీత పనులను త్వతరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్