ఇల్లందు మండలం మోదుగులగూడెం గ్రామానికి చెందిన గొగ్గెల సాయి అనారోగ్యంతో వారం క్రితం కొత్తగూడెంలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి సాయి దగ్గరే ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, అరతులం వెండి కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.