మధిర పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మంగళవారం ఆలయ అర్చకులు నంబూద్రి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి కేరళ సాంప్రదాయంలో ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక మంగళ హారతులతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి కోలాహలంగా పురవీధులలో ఊరేగింపు గా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.