బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్ట్ పై సీపీఎం, బీజేపీ పార్టీల మండల కమిటీలు ఖండించాయి. చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ఆయా పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆయనపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం భావ్యం కాదన్నారు. ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నట్లు సీపీఎం మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, బీజేపీ మండల అధ్యక్షడు కొండా గోపి తెలిపారు.