చింతకాని మండల పరిధిలో గల పాతర్లపాడు గ్రామంలో ప్రభుత్వం నిర్మించి నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు అసలైన నిరుపేదలకి వచ్చేలా సహకరించాలని త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటామని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా సహకరించాలని సర్పంచ్, ఉప సర్పంచ్ ,యం. పి.టి.సి మరియు గ్రామ పెద్దలను ఎమ్మార్వో తిరుమలచారి గారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, ఉప సర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు యం. పి.టి.సి బొర్రా ప్రసాద్, ఆర్.ఐ రగు తదితరులు పాల్గొన్నారు.