చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన కోపూరి నాగార్జున ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. నాగార్జున మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు ఆకలి అందరిది గ్రూప్ సభ్యుల సహకారంతో సుమారు 2, 3 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులను ఆదివారం బీజేపీ మండల అద్యక్షుడు కొండా గోపీ చేతుల మీదుగా అందజేశారు. ముగ్గురు ఆడ పిల్లల చదువుతో పాటు వారి కుటుంబానికి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.