నేలకొండపల్లిలోని మార్కెట్ యార్డులో సోమవారం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వెన్నపూసల సీతారాములు, పాలకవర్గ సభ్యులు సాయంత్రం 3. 30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గోని విజయవంతం చేయాలని కోరారు.