గండి మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన ఏసీపీ

53చూసినవారు
గండి మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన ఏసీపీ
కూసుమంచి మండలం హఠ్యతండా సమీపంలో ఇటీవల వచ్చిన భారీ వరదలకు ఎన్నెస్పీ కాలువకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. అక్కడ జరుగుతున్న మరమత్తు పనులను శుక్రవారం ఏసీపీ తిరుపతిరెడ్డి పరిశీలించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏసీపీ అన్నారు. పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్