డీసీఎం వ్యాన్ బోల్తా... ఒకరు మృతి

2274చూసినవారు
డీసీఎం వ్యాన్ బోల్తా... ఒకరు మృతి
నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో డీసీఎం వ్యాన్ బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి మిర్యాలగూడకు పనసకాయలతో వెళ్తున్న డీసీఎం గువ్వలగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు పల్టీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నాగరాజు (38) మృతి చెందగా, వై. ప్రభాకర్ (35)కు తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్