

లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కొడుకు అరెస్టు (వీడియో)
చత్తీస్‌గఢ్‌లో లిక్కర్ స్కామ్‌పై ఈడీ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసింది. దాదాపు ₹2100 కోట్ల స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో దుర్గ్‌లోని అతని ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. రెయిడ్స్ ముగిసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. చైతన్య భగేల్‌పై ఈడీ విచారణ చేపట్టడం ఈ ఏడాది ఇది రెండోసారి. కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది.