ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు సమర్పించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.