సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్‌జెండర్లకు సమగ్ర వైద్యం అందించేందుకు మైత్రి ట్రాన్స్ క్లినిక్ విభాగం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలందించేందుకు క్లినిక్ కు ప్రారంభించారు. ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్స్ తో మాట్లాడారు. ఇక్కడ ఇంక ఎలాంటి వైద్య సదుపాయాలు కావాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు.