కూసుమంచి మండలం పెరికసింగారం విద్యుత్ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పాలేరు ఏఈఈ తావుర్యా ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో జక్కేపల్లి, పెరికసింగారం, గట్టుసింగారం, మల్లేపల్లి, గన్యాతండా గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.