రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షను నెరవేర్చడం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నదని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.