రాష్ట్రప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పిల్లలు ఉన్నత స్థాయికి చేరడం ద్వారా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మండలంలో 8, 9, 10వ తరగతి చదువుతున్న 157 మంది బాలికలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేశారు. కష్టపడితే ఫలితం ఉంటుందని విద్యార్థులకు సూచించారు.