మార్కెట్ కు మంచి పేరు తెచ్చే విధంగా పదవికి వన్నె తేవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన మాట్లాడారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అయ్యారని, ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడాలని వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇచ్చామని పేర్కొన్నారు. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పారు.