పౌర హక్కు సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సెప్టెంబర్ 5 కరకగూడెంలో జరిగినటువంటి ఘటనలో భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై, రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు శనివారం కరకగూడెం వస్తున్న నేపథ్యంలో మణుగూరులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని అశ్వాపురం స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నటువంటి 12 మందిలో ఒక ప్రముఖ వైద్యుడు గైనకాలజిస్ట్, ప్రొఫెసర్, విద్యావంతులు మేధావులు ఉన్నట్లు సమాచారం.