చిరుతపులి దాడిలో మహిళ మృతి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో చిరుతపులి ఇప్పటి వరకు ఏడుగురిని బలితీసుకున్నట్లు తెలుస్తోంది. మనుషులపై తరచుగా దాడి చేసే ఈ చిరుతపులిని చంపేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.