సత్తుపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.