నేరుగా ఖాతాల్లోకి నష్టపరిహారం: ఆర్డీవో
తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు నేరుగా తమ బ్యాంకు ఖాతాలో నష్టపరిహారం జమ అవుతాయని కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్ తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ. తుఫాను ప్రభావంతో విస్తారంగా పడిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 16, 500 నష్టపరిహారం నేరుగా బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేస్తామన్నారు. కల్లూరూలో 18, ఏన్కూరు 2, పెనుబల్లి 12, సత్తుపల్లి 7. తల్లాడ 73, వేంసూరు 47 కుటుంబాలు నష్టపోయారన్నారు.