కారేపల్లి మండలం పరిధిలోని మంగలి తండ గ్రామంలో వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు తెలిపారు. శనివారం పిల్లలమర్రి లక్ష్మణ్ అనే వ్యక్తికి సంబంధించిన ఖాళీ స్థలంలో అదే గ్రామానికి చెందిన పిల్లలమర్రి వీరన్న వరిగడ్డి పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా లక్ష్మణ్ అడ్డు చెప్పాడు. దీంతో వీరన్న అసలు కుమారుడు పిల్లలమర్రి నరేందర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు.