ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నవంబర్ 27న జరిగిన జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి, మర్డర్ మిస్టరీని త్వరగా ఛేదించినందుకు గాను, కారేపల్లి సీఐ బి. తిరుపతిరెడ్డిని శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కమిషనర్ కార్యాలయంలో మెమొంటో అందించి అభినందించారు. నేలకొండపల్లిలో వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును ఛేదించిన కారేపల్లి సీఐ కృషికి గాను సీపీ మెమోంటోను అందజేశారు.