ఏన్కూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ప్రధాన రహదారి వద్ద బీఆర్ అంబేద్కర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ డప్పు కొట్టి సంఘం నేతలను ఉత్సాహపరిచారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష డప్పుల. వేయి గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.