భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

12120చూసినవారు
భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం
ఆర్ధిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక రెండు నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త అనూహ్యంగా దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామేపల్లి మండలం గోవిందరాలలో జరిగింది.