TG: జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూట్యూబ్‌లో ఏదో ఒక ఛానెల్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు శ్రుతి మించుతున్నాయని, దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామన్నారు. అసలు జర్నలిస్టులు అంటే ఎవరో ఒక డెఫినెషన్ ఉండాలన్నారు.