ఇంట్లో దూరిన కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో

61చూసినవారు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నరపుర తాలూకా శెట్టికొప్పలోని ఓ ఇంట్లో కింగ్ కోబ్రా పాము దూరింది. బాగా పొడవుగా ఉన్న ఆ పామును చూసి ఇంట్లోని వారంతా భయపడ్డారు. ప్రాణభయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడకు చేరుకున్నాడు. వంటగదిలో సిలిండర్ పక్కనే దాక్కున్న ఆ పామును నేర్పుగా బంధించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్