వివాదంలో కోహ్లీ ఔట్

566చూసినవారు
వివాదంలో కోహ్లీ ఔట్
ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చెత్త అంపైరింగ్‌కు బలయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. నోబాల్‌ను ఔట్ ఇవ్వడంతో కోహ్లీ సైతం అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. మరో వైపు మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, నవ్‌జ్యోత్ సిద్ధూ కూడా అంపైర్ల తీరును తప్పుబట్టారు. ఇది ముమ్మాటికి నాటౌట్‌ అని, అత్యంత చెత్త నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్