అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ వారి నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏఐవైఎఫ్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి, యువజన సమస్యల పరిష్కార ఎజెండానే ఏఐవైఎఫ్ ప్రధాన కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, కొదురుపాక మహేష్, తదితరులు పాల్గొన్నారు.