జన్కపూర్ పాత కలెక్టరేట్ లో గల టాస్క్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 వ తరగతి, ఇంటర్,డిగ్రీ, డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసి 18 నుండి 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు.