వాంకిడి మండలం బెండర గ్రామ సమీపంలో మోడల్ డిగ్రీ కళాశాల ప్రారంభించి ఇప్పటికీ సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ కళాశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థులు ఆ సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని డివైఎఫ్ఐగా కోరుతున్నాం. లేని పక్షంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తామని అధికారులను హెచ్చరించారు.