వేసవి క్రీడా శిబిరాలు ప్రారంభం

65చూసినవారు
వేసవి క్రీడా శిబిరాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను బుధవారం కొమురంభీం జిల్లా కేంద్రంలో డీవైఎస్వో ఆర్. రమాదేవి ప్రారంభించారు. క్రీడాకారులకు సామగ్రి పంపిణీ చేశారు. జిల్లాలో ఈ నెల 1- 31 వరకు 11 క్రీడలకు సంబంధించిన శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్