ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ

71చూసినవారు
ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ
కొమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని ఘాట్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ లోయలో పడిపోయింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వైపు వస్తున్న లారీ ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలోకి జారి పడిపోయింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఘాట్ రోడ్డుపై సింగిల్ రోడ్డు ఉండటంతో నిత్యం ఏదోఒక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్