ఆసిఫాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ

2587చూసినవారు
ఆసిఫాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్. పి కే. సురేష్ కుమార్ శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖి చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సి. ఐ సతీష్, ఎస్. ఐ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్