కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మత్తడి స్ప్రింగానకట్ట జలపాత అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బెజ్జూర్ మండల కేంద్రం నుంచి సిద్ధపూర్ మీదుగా 7 కిలోమీటర్లు దూరంలో మత్తడి స్ప్రింగాన కట్ట ఉంటుంది. పచ్చని అడవి, పక్షుల కిలకిలలు, జలపాతాల అందాలు ఆకట్టుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ జలధారను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.