ములకలపల్లి మండలం పలు పంచాయతీలలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి పలు గ్రామాలకు, మండల కేంద్రానికి పూర్తిగా రాకపోకలు బందు కావడం కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని స్థానికులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే జనసేన పార్టీ తరఫున అసంపూరిత బ్రిడ్జిలను సందర్శించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అసంపూర్తి బ్రిడ్జిల వలన రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి.