కుక్కల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

78చూసినవారు
కుక్కల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
చండ్రుగొండ ఎస్సీ కాలనీలో కుక్కల బెడద ఎక్కువైందని శనివారం స్థానికులు చెప్పారు. ఎక్కువ సంఖ్యలో కుక్కలు రోడ్డుపై సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రోడ్లపైకి చేరిన పిల్లలు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. గ్రామపంచాయతీ అధికారులు కుక్కల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి అదుపు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్